KKR captain: కెప్టెన్‌గా అజింక్య రహానె..! 1 y ago
మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్ (IPL 2025) టోర్నీ ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్‌కు కొత్త జెర్సీతో సిద్ధమవుతున్న డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తాజాగా కెప్టెన్‌ను కూడా ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ అజింక్య రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఇక, యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలిచ్చింది. ఈ మేరకు ప్రాంఛైజీ సోమవారం తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో ప్రకటించింది.